భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగడానికి మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఈ వరల్డ్ కప్ కి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా.. ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ కి ఎవరొస్తారో చెప్పేసాడు. 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్ చేరాతాయని అప్పుడే జోస్యం చెప్పేసాడు. మార్ష్ ఆస్ట్రేలియా కాబట్టి ఆసీస్ జట్టు ఫైనల్ కి వస్తుందని భావించినా..భారత్ కాకుండా పాక్ ఫైనల్ కి వస్తుంది అని చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపించింది.
ALSO READ :ప్రాక్టీస్ డుమ్మా కొట్టి షికారుకెళ్లిన క్రికెటర్లు.. పాక్ మ్యాచ్ కు ముందు ఇలానా
ఒక పాడ్ కాస్ట్ లో మార్ష్ మాట్లాడుతూ "ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్ జట్టు 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడతాయి. ఇటీవలే కాలంలో పాకిస్థాన్ అద్భుతమైన క్రికెట్ ఆడుతుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా ఉంది. వీరికి కూడా ఈవెంట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది". అని తెలిపాడు. ఈ పాడ్ కాస్ట్ లో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు గిల్ క్రిస్ట్, ఇంగ్లాండ్ దిగ్గజం మైకేల్ వాన్ కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆస్ట్రేలియా జట్టుపై చాలా ధీమాగా, నమ్మకంగా మార్ష్ ఉన్నట్లు తెలుస్తుంది.
అక్టోబర్ 5 నుంచి మొదలు కానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19 న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. తొలి మ్యాచులో న్యూజిలాండ్ తో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తలబడుతుంది. 8 న భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో తలబడుతుంది. మరి మార్ష్ అంచనా ప్రకారం ఏ రెండు జట్లు ఫైనల్ కి వెళ్తాయో చూడాలి.
Australia's T20i Captain Mitchell Marsh thinks, it will be Australia vs Pakistan Final in #WorldCup2023 ? pic.twitter.com/emI3I4Eb69
— Basit Subhani (@BasitSubhani) September 8, 2023